![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లి పోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -4 లో.. సీతాకాంత్ తన చెల్లెలు సిరిపై ఉన్న ప్రేమతో తనకి శత్రువు వల్ల ఇబ్బంది కలగకూడదని కాలేజీకీ సైతం తనతో సెక్యూరిటీస్ ని పంపిస్తాడు. దాంతో సిరి కోపంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎవరి గురించో ఆలోచించి.. సిరి యొక్క చిన్న చిన్న ఆనందం మిస్ చేస్తున్నావని వాళ్ళ తాతయ్య అంటాడు. నా చెల్లిని కాపాడుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. నువ్వు ఒక ఎమోషనల్ ఫూల్ వి అని వాళ్ళ తాతయ్య అనగానే.. అవును నేనొక ఫ్యామిలీ ఎమోషనల్ ఫూల్ ని అని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత సిరి కాలేజీకి వెళ్తుంది ధన కూడా అదే కాలేజీ. తన ఫ్రెండ్స్ సిరి గురించి మాట్లాడుతుంటే.. మీకు వేరే పనే లేదా అంటూ వాళ్ళని క్యాంటీన్ కి తీసుకొని వెళ్తాడు. అసలు ట్విస్ట్ ఏంటి అంటే ధన, సిరి ఇద్దరు లవర్స్. ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడ తెలియకుండా లవ్ చేసుకుంటారు. వాళ్ళు క్యాంటీన్ లో కూర్చొని ఎవరికి కన్పించకుండా తాము తింటున్న ఫుడ్ ని షేర్ చేసుకుంటారు. సిరి చేతిని ధన పట్టుకొని ఉండగా.. ధన ఫ్రెండ్ చూసి.. వీళ్ళు ఇంత సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత సీతాకాంత్ కార్ పై ఉన్నా కలర్ చూసి వాష్ చెయ్యకుండా ఉంటే బావగారు తిడుతారని సీతాకాంత్ తమ్ముడి భార్య అంటుంది. పని వాళ్ళకి చెప్పి క్లీన్ చేపిస్తుండగా డ్రైవర్ వచ్చి.. వద్దని చెప్తాడు. ఎందుకని అడుగగా.. ఒక అమ్మయి ఇలా సర్ కార్ పై కలర్ చల్లింది. ఆ అమ్మయి వచ్చే క్లీన్ చెయ్యాలని డ్రైవర్ చెప్తాడు.
ఆ తర్వాత సీతాకాంత్ మరదలు కావాలనే.. ఎవరో అమ్మయి అంట అంటు వాళ్ళ అత్తయ్యకి వినపడేలా అంటుంది. దాంతో ఆవిడ వెళ్లి సీతాకాంత్ ని విషయమేంటని అడుగుతుంది. అవునని చెప్తాడు. అక్కడే ఉన్న వాళ్ళ తాతయ్య.. నువ్వేంటి.. అంత జరిగితే ఏం అనకపోవడమేంటని అడుగుతాడు. నాకేం అర్థం కాలేదు.. వింతగా అనిపించిందని అతని అనుభూతిని వాళ్ళ తాతయ్యతో సీతాకాంత్ చెప్తాడు. అదే సమయంలో రామలక్ష్మి తన చెల్లెలితో డ్రెస్ కి ఉన్నా కలర్ గురించి చెప్తు.. అప్పుడు తన అనుభూతిని చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ బరత్ దగ్గర ఉన్నా బ్యాండ్ వాళ్ళ దగ్గరకి వెళ్లి వాళ్ళ ద్వారా రామలక్ష్మి అడ్రస్ తెలుసుకొని వాళ్ళింటికి వెళ్తాడు. అనుకోకుండా రామలక్ష్మి, సీతాకాంత్ లు పక్కన నుండి వెళ్తూ ఆగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |